విజయమ్మకు దుబాయ్ బాధితుల కృతజ్ఞతలు

హైదరాబాద్ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహాయ, సహకారాలతో దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన పది మంది తెలుగువారు మంగళవారంనాడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. దుబాయ్‌ నుంచి వీరంతా మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు విమానంలో చేరుకున్నారు. దుబాయ్‌లో అనధికారికంగా ఉంటున్న వీరికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి స్వదేశం తిరిగి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చింది. మన దేశానికి తిరిగి వచ్చేందుకు తమకు సహాయ, సహకారాలు అందించిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మకు కతజ్ఞతలు తెలపాలని వారంతా అనుకున్నారు. నల్లగొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్న గ్రామానికి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా కనగల్ వద్ద‌ శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిలను కలిసి కతజ్ఞతలు తెలిపారు.

అధికారిక పత్రాలు లేక, చేసేందుకు పని లేక స్వదేశానికి తిరిగివచ్చేందుకు చేతిలో డబ్బులు లేక అష్టకష్టాలు పడుతున్న దుబాయ్ బాధితులు హైదరాబా‌ద్ చేరుకునేందుకు అయిన విమాన, ఇతరత్రా ఖర్చులను వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ ఎన్నారై (ప్రవాస భారతీయుల) విభాగం ఏర్పాటు చేసింది. తొలివిడతలో 26 మందిని, రెండవ విడతగా మరో పదిమందిని మన దేశానికి తీసుకువచ్చినట్లు పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంక‌ట్‌ మీడియాకు తెలిపారు.

‌దుబాయ్‌ బాధితులకు వెంకట్‌తో పాటు మైగ్రెంట్సు కౌన్సిల్ అధ్యక్షుడు భీ‌మ్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. స్వదేశానికి చేరుకున్న వారిలో వై.నరసయ్య, వీరన్న రాంబాయి (నిజామాబాద్), జి.రాములు (కరీంనగ‌ర్) పాప జుత్తిక, ఓగూరి మంగతాయారు, సిహె‌చ్ రామలక్ష్మి, మల్లికార్జునరాజు, శామ్యూ‌ల్‌ (తూర్పు గోదావరి), చంద్రకాంతం, ఎ.కుమారి (పశ్చిమగోదావరి) ఉన్నారు.

స్వచ్ఛందంగా బాధితులకు సహాయం చేసింది వీరే!:
అమెరికాలోని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభిమానులు, నాయకులు సుబ్బారెడ్డి చింతకుంట, రమే‌ష్ వల్లూరు, డాక్ట‌ర్ వాసుదేవరెడ్డి, ధనుంజ‌య్ ఘట్టం, గురవారెడ్డి పుణ్యాల, రాజశేఖ‌ర్ కసిరెడ్డి, సుబ్బారెడ్డి పమ్మి, ఇంద్రసే‌న్ గంగసాని, రామకష్ణ అగ్తు, రవి బల్లాడ, దయాక‌ర్‌రెడ్డి, రఘు పాడి, పవన్ నరంరెడ్డి, మల్లికార్జు‌న్ ఘట్టంనేని, దేవనా‌థ్ గోపిరెడ్డి గ‌ల్ఫు బాధితులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అయిన ప్రయాణ ఖర్చులను స్వచ్ఛందంగా అందచేశారని వెంకట్ ‌వివరించారు. వివిధ దేశాల్లో ఉన్న వైయస్‌ఆర్‌సిపి అభిమానులు మానవతా దృక్పథంతో ఈ సాయం చేశారని మేడపాటి వెంకట్ తెలిపారు. పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను దుబాయ్ బాధితులు కలిసిన‌ప్పుడు పార్టీ నాయకులు కె.కె. మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకష్ణారెడ్డి కూడా ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top