విదేశాలలో జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్: వై‌యస్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి 40వ పుట్టినరోజు వేడుకలను విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. శ్రీ జగన్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్రులు సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వైయస్‌ఆర్‌ సిపి ప్రవాసాంధ్ర విభాగం కన్వీనర్‌ మేడపాటి వెంకట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

అమెరికా, కువైట్, దుబా‌య్ తదితర దేశాల్లో‌ని వైయస్ అభిమానులు,‌ పార్టీ కార్యకర్తలు రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వెంకట్ ఆ ప్రకటనలో వెల్లడించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించడంతో పాటు ఆయనను అక్రమంగా అరెస్టు చేసి, జైలులో నిర్బంధించడాన్ని నిరసిస్తూ కువైట్‌లో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఈశాన్య అమెరికాలోని వైయస్ అభిమానులు నిత్యాసవర స‌రకులు సేకరించి న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్సు, న్యూయార్కులోని పీపుల్ ‌టు పీపుల్ అనే సంస్థకు అందజేశారు. ఆళ్ల రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. టెక్సా‌స్ నుంచి‌ శ్రీ జగన్ అభిమానులు పంపించిన లక్ష ‌రూపాయలను మానసిక వికలాంగులను చేరదీస్తున్న అనురాగ్ సంస్థకు అందజేసినట్లు మేడపాటి వెంక‌ట్ ‌వివరించారు.

కాగా, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కువైట్‌లో మూడు వేల మంది అభిమానులు, పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుమ్మక్కుపై వినూత్న‌ంగా నిరసన తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా సంతకాలు సేకరించారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు పంపించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రభాకర్, చంద్రశేఖ‌ర్‌రెడ్డి, గోవింద్ నాగరాజు, సయీ‌ద్ నాజ‌ర్, భాస్క‌ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top