లాస్‌ ఏంజిల్సులో వైయస్ మూడవ వర్ధంతి

లాస్‌ ఏంజిల్సు, 2 సెప్టెంబర్‌ 2012 : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని లాస్‌ ఏంజిల్సులోని వైయస్‌ ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యులు నిర్వహించారు. సెప్టెంబర్‌ 2వ తేదీన లాస్‌ ఏంజిల్సు మిషన్‌ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి అన్న సమారాధన చేశారు.‌ వైయస్‌ ఫ్యాన్‌ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల నాయకత్వంలో వైయస్‌ వర్ధంతి కార్యక్రమాలు చక్కని క్రమశిక్షణతో జరిగాయి.

ఈ సందర్భంగా వీరారెడ్డి నంద్యాల మాట్లాడుతూ, వైయస్‌ సంస్మరణ కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించడం తమకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వర్గీయ వైయస్‌ఆర్‌కు ఇలా నివాళులు అర్పించడం ఉత్తమం అన్నది తమ సంస్థ భావన అన్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ జ్ఞాపకాలను నిత్యం స్మరించుకోవడానికి ఆయన అభిమానులు, అనుయాయుల సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి తమ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. దివంగత వైయస్‌ పట్ల తనకు ఉన్న ‌అవ్యాజమైన ప్రేమాభిమానాలను చాటుకోవడానికి వైయస్ ఫ్యాన్‌ క్లబ్ పలు సరికొత్త అలోచనలతో ముందు వరుసలో నిలుస్తున్నదన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్‌ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన మూడవ వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

నిరుపేదలకు సహాయం అందిస్తూ, మత్తుపదార్థాలకు బానిసలైన వారిని మళ్ళీ మంచిదారిలో పెట్టడం, నీడ లేని వారిని చేరదీయడం లాంటి కార్యక్రమాలతో లాస్‌ ఏంజిల్సు మిషన్‌ ప్రపంచంలోనే ముందున్నది.

వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమానికి ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి స్థాపించిన 'డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి ఫ్యామిలీ ఫౌండేషన్‌' నిధులు సమకూర్చింది. 'అవసరానికి ఆదుకునే హస్తం' లక్ష్యంతో 1986 నుండి ఈ సంస్థ పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తమ సంస్థ ఏర్జాటైనప్పటి నుండి ఆరోగ్య రక్షణ కోసం, అవసరంలో ఉన్న వారిని ఆదుకునేందుకు డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి 350 మిలియన్‌ డాలర్లను విరాళంగా అందజేశారు. ఎలాంటి లాభాన్ని ఆశించని స్వచ్ఛంద సంస్త డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి ఫ్యామిలీ ఫౌండేషన్‌ అత్యంత వెనుకబడిన జాతుల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు, ఆరోగ్య రక్షణ రంగంలోని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలో ఎనలేని సేవలు చేస్తున్నది.

డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డిది స్వచ్ఛంద సేవ నాణానికి ఒక వైపు అయితే, మరో వైపున ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్డర్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు.
ఆప్తుడు. నిజమైన మిత్రుడు. వైయస్‌ మరణం వారిద్దరినీ భౌతికంగా విడదీసినా మనసులు మాత్రం స్నేహితులుగా చిరస్థాయిగా కలిసే ఉంటాయి. నిజమైన స్నేహానికి సరిహద్దులు లేవు. మంచితనానికి డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి అసలైన ఉదాహరణగా నిలుస్తారు.

వైయస్‌ వర్ధంతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వైయస్‌ ఫ్యాన్సు క్లబ్‌ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సదర్ను ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నాగేశ్వరరావు, నాటా అడ్వయిజరీ కౌన్సిల్‌ ధర్మారెడ్డి గుమ్మడి, రాజా కేసిరెడ్డి, మల్లిక్‌ ఆర్‌ బొంతు, వీరబాబు, దేవరకొండ నాగ్‌, సుధీర్‌ ఓబులం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కౌన్సెలర్‌ కెన్నెత్‌ వియియమ్సు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top