వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు

అనంతపురం: టీడీపీ నేతపై సోషల్‌మీడియాలో పోస్టు పెట్టిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త మిట్ట ఆంజనేయులుపై ధర్మవరం సీఐ  అస్రార్‌ బాషా దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్‌ స్థలాన్ని టీడీపీ నేత పూజారి రాములు కబ్జా చేశాడు. ఈ విషయాన్ని ఆంజనేయులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. టీడీపీ నేతల కబ్జాలపై చర్యలు తీసుకోని అధికారులు..కబ్జాను బయటపెట్టిన ఆంజనేయులుపై ధర్మవరం సీఐ అస్రార్‌ బాషా దాడికి పాల్పడ్డారు. 
 

Back to Top