బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ అండ

విశాఖ: రసాయనం తాగి మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా నిలిచింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు. విప్ప సారాగా భావించి రసాయనాన్ని తాగటంతో ఈ «ఘటన చోటు చేసుకుంది. కేజీహెచ్‌ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ నేత కుంభా రవిబాబు బాధితులకు అండగా నిలిచారు. దుర్ఘటనకు జీవీఎంసీ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top