కడప ఎస్పీని కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు 

వైయ‌స్ఆర్ జిల్లా : జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఓ వినతిపత్రం అందించారు. జిల్లాలో అకారణంగా తొలగిస్తున్న ఓట్లపై విచారణ చేపట్టాలని, వైయ‌స్ఆర్‌సీపీ  బూత్ కమిటీ సభ్యుల మీద పోలీసులు కేసులు పెట్టడాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే జిల్లాలో మరికొన్నిచోట్ల వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని, వీటిని పరిశీలించి న్యాయం చేయాలని వారు ఎస్పీని కోరారు.

Back to Top