చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టి, రైతుకు సంతోషం అందిచాలని సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు ధర్మాన ప్రసాదరావు. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే మరో అడుగు ముందుకేసి మరింత ఎక్కువ సాయం అందిస్తున్నారు. రైతుభరోసాకు ఇస్తానన్న రూ. 12,500 సాయాన్ని మరింత పెంచి 13,500 చేసి రైతులకు ఇస్తున్నారు.రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రూ. 1500 కోట్లతో విద్యుత్ లైన్లు మెరుగుపరుస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు అన్ని విధాలా సలహాలు సూచనలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకూ దేశంలో ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు.లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొని ధర స్థిరీకరణ చేసి, ఇది రైతు రాజ్యం అని నిరూపించారు వైయస్ జగన్.