బీసీల అభివృద్ధికి వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉంది..

వైయస్‌ జగన్‌తోనే విప్లవాత్మకమైన మార్పు..

వైయస్‌ఆర్‌సీపీ నేత తలారి పీడీ రంగయ్య

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పు సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో వైయస్‌ జగన్‌ ప్రకటించిన ప్రతి అంశం సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు దోహదపడుతుందన్నారు. సమాజంలో పేదరికానికి మూలం సంపదను సమానంగా పంచక పోవడమనే సత్యాన్ని జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ద్వారా నిశితంగా గమనించారన్నారు.కంటికి కనిపించిన పేదరిక నిర్మూలనకు దోహదపడే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు.జాతీయ,రాష్ట్ర సంపదను పూర్తిగా బడుగు,బలహీన వర్గాల ప్రజలకు 50 శాతం కేటాయిస్తామని చెప్పడం విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించవచ్చన్నారు.వైయస్‌ఆర్‌ విద్య,వైద్యం,ఉద్యోగానికి పెద్దపీట వేశారన్నారు.ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఎందరో పేదలు ఉన్నత చదువులు చదివి జీవితాల్లో స్థిరపడ్డారన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉందని చెప్పేందుకు జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషనే నిదర్శనమని తెలిపారు.

Back to Top