విజయవాడ: కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు సమీక్ష నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, నాయకులు దేవినేని అవినాష్,తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంపై చర్చించారు. నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి, మత్రులు దిశా నిర్దేశం చేశారు.