జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌వి

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌
 

ఏలూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇవాళ ఏలూరులో నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న‌లో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తున్న‌ట్లు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. జ‌న‌నేత నిర్ణ‌యంతో పార్టీలోని నేత‌లంతా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అలాగే వైయ‌స్ జ‌గ‌న్ బీసీల‌కు ఇచ్చిన హామీల ప‌ట్ల పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. స‌భా ప్రాంగ‌ణ‌మంతా జై జ‌గ‌న్‌...జోహార్ వైయ‌స్ఆర్‌..కాబోయే సీఎం జ‌గ‌న్ అంటూ పెద్ద పెట్టున నిన‌దించారు.

Back to Top