విశాఖ వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ దాడి సూర్యకుమారి మృతి

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖలో విషాదం చోటు చేసుకుంది. 61వ వార్డు కార్పొరేటర్‌ దాడి సూర్యకుమారి ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె విశాఖ పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 10వ తేదిన జరిగిన గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి 61వ వార్డుకు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top