సీఎం వైయ‌స్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు

 విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్‌ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ఉద్యమానికి కొండంత బలం ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్ జగన్ రెండు సార్లు లేఖ రాశారని, విశాఖ ఉక్కు ఉద్యమానికి వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉందని రాజశేఖర్‌ అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top