యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌తో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం

అమరావతి: యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌తో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. పలు అంశాలపై కాథరీన్‌ హడ్డా ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సూల్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా ట్విటర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో ఈ సందర్భంగా షేర్‌ చేశారు. 

Back to Top