ఆ దంపతుల మృతి ప‌ట్ల పెద్దిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి

అమరావతి: పంచాయతీరాజ్‌ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసే శాంతకుమారి దంపతులు కరోనాతో చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రెండ్రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు కరోనాతో చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని పెద్దిరెడ్డి అన్నారు. వీరిద్దరు కూడా ఏపీ సచివాలయంలోనే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.ఈ మహమ్మారి మొదట శాంతకుమారి భర్తకు సోకింది. ఆయన, ఆసుపత్రిలో ఉండి చికిత్స  తీసుకున్నప్పటకి ప్రాణాలు దక్కలేదు.  తాజాగా, శాంతకుమారి కూడా కరోనాతోనే  చనిపోయింది. వీరి కుటుంబానికి పెద్దిరెడ్డి రామచం‍ద్రారెడ్డి  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top