కృష్ణా జిల్లాలో నేడు ‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇవాళ జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే మేక ప్రతాప్‌ అప్పారావు తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా పాడి రైతులతో మాట్లాడుతారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా రైతులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top