నేడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిని శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు  ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను ప‌రిశీలించేందుకు వెళ్లారు. క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేరి ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆయన పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం ఇది మూడోసారి.  ఉదయం 11.50 నుంచి 1.15 వరకు పనుల పురోగతిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.  

Back to Top