వైయ‌స్ఆర్ సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి

 కృష్ణా జిల్లా : ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచాడన్న అక్కసుతో వైయ‌స్ఆర్ సీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా లింగారెడ్డిపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థి దాసరి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఈ సందర్భంగా పంచాయతీ శివారు గ్రామమైన చినగుడుమోటు వైయ‌స్ఆర్ సీపీ నేతలు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బాణసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది చూసి ఓర్వలేక అక్కడే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ వర్గీయులు నజీర్‌బాషా, షేక్‌ ఆదాం, నాగుల్‌మీరాబాషాలు వైయ‌స్ఆర్ సీపీ నేత మగ్బుల్‌బాషాపై కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మగ్బుల్‌బాషాను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top