చిత్తూరులో టీడీపీ నేత రౌడీయిజం

వైయ‌స్ఆర్‌‌ సీపీ కార్యకర్తపై టీడీపీ నేత హత్యాయత్నం

 
 చిత్తూరు ‌: వైయ‌స్ఆర్ ‌సీపీ కార్యకర్తపై చిత్తూరు మాజీ మేయర్‌ హేమలత భర్త కటారి ప్రవీణ్‌ దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. టూటౌన్‌ సీఐ యుగంధర్‌ కథనం మేరకు..  కయినికట్టు వీధికి చెందిన జాన్సన్‌ పది రోజుల క్రితం ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. అదే సమయంలో కటారి ప్రవీణ్‌ వాహనానికి అడ్డు వచ్చాడు. దీనిపై ఇద్దరికీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈనెల 22న జాన్సన్‌ రోడ్డుపై వెళుతుండగా ‘నువ్వు ఈ మధ్య వైయ‌స్సార్‌సీపీకి అనుకూలంగా తిరిగావు’ అంటూ తన వెంట తెచ్చిన ఇనుప రాడ్‌తో దాడి చేశారు. దీంతో జాన్సన్‌ చేయి విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. బాధితుడు, అతని కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజా వీడియోలు

Back to Top