పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

  పుట్టపర్తి : అడ్డుగా వచ్చిన నాగుపామును రక్షించబోయి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కారుకు ప్రమాదం జరిగిన ఘటన పుట్టపర్తి మండలం కంబాలపర్తి వద్ద  చోటు చేసుకుంది. కంబాలపర్తి గ్రామం దాటగానే పొలాల్లో నుంచి పెద్ద నాగుపాము కారుకు అడ్డుగా వచ్చింది. డ్రైవర్‌ షడన్‌గా బ్రేక్‌ వేశాడు. వెనుక కాన్వాయ్‌లో వస్తున్న మరో కారు ఎమ్మెల్యే కారును ఢీకొంది. ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్‌లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top