నిర్వాసితుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  మూడు దశాబ్దాలుగా కళ్ళు కాయలు కాచేలా పరిహారం కోసం ఎదురు చూసిన సి.బి.ఆర్. నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ట్వీట్ చేశారు. గత పాలకులు విస్మరించిన పరిహారం ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌ని చెప్పారు. ఆర్ & ఆర్ ప్యాకేజ్ క్రింద వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం 240.52 కోట్లు అందజేస్తున్న‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తొలి అడుగు శుభ ప‌రిణామం.. 

రాయలసీమ ప్రజలకి కృష్ణా మిగుల జలాలని అందించి, రాయలసీమని రత్నాలసీమగా మార్చాలనే చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా పడిన తొలి అడుగు శుభపరిణామం. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యని పరిష్కరించటానికి మన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారు చేస్తున్న కృషి అభినందనీయమంటూ మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top