నీరు–చెట్టు అవినీతిపై విచారణ జరిపించండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
 

అమరావతి: నీరు– చెట్టు పేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. నీరు– చెట్టు పథకంలో తవ్విన మట్టిని గట్లకు, పొలాలకు తరలించకుండా అమ్ముకున్నారన్నారు. ట్రాక్టర్లలో మట్టిని సుదూర ప్రాంతాలకు తరలించి అమ్ముకొని కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. చెరువుల్లో నిలువెత్తులోతులో గుంతలు తీయడంతో పశువులు మృత్యువాతపడ్డాయన్నారు. ఆ గుంతలను చూసి భయపడి మత్స్యకారులు చేపలు పట్టేందుకు కూడా వెళ్లడం లేదన్నారు. నీరు– చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top