కొబ్బరి పరిశ్రమలోని కార్మికులకు కూడా పింఛన్ కావాలి

పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ముమ్మిడివరం
 

 

చేనేతలు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులు ఇలా ఎందరో చేతి వృత్తులవారికి 50ఏళ్లకే సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. కొబ్బరి పరిశ్రమ మీదకూడా ఆధారపడిన 50,000 మంది ఉన్నారు. ఒలుపు కార్మికులు, దింపు కార్మికులు మొదలైనవారున్నారు. 50ఏళ్లు దాటేసరికి వాళ్లకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమైతున్నాయి. చేతి వృత్తుల వారికి ఇస్తున్నవిధంగానే 50ఏళ్లకు పింఛన్లు కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులకు కూడా వర్తింపచేయమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

Back to Top