వైయస్‌ జగన్‌ సీఎం కాగానే 4 లక్షల ఉద్యోగాలు

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌
 

అమరావతి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు మంజూరు చేశారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. శుక్రవారం సభలో ఆయన మాట్లాడుతూ..మా ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత టీడీపీకి లేదన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగ కల్పన చేశారని తెలిపారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే నిరుద్యోగ భృతిని టీడీపీ ప్రకటించిందన్నారు. సమ్మిట్ల పేరుతో 22 లక్షల కోట్లకు అగ్రిమెంట్‌ చేసుకున్నారన్నారు. అర్హత లేని వ్యక్తులను తెచ్చి అగ్రిమెంట్‌ పేరుతో టీడీపీ డ్రామాలు ఆడిందన్నారు. ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికి తెలుసు అన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top