గ్రామ స‌చివాల‌యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్‌

శ్రీ‌కాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం సంతఊరిటి గ్రామంలో నూత‌నంగా నిర్మించిన గ్రామ‌ సచివాలయం భవవాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.40లక్షలు వ్యయంతో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని నిర్మించారు.  కార్యక్రమంలో జి.సిగడాం మండలం ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ,జడ్పీటీసీ కాయల రమణ,జి.సిగడాం, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు బత్తుల సన్యాసిరావు, మహంతి పెద్దరామునాయుడు, జే.సి.యస్ ఇంచార్జ్ డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీ తోలేటి వెంకటరావు, జి.సిగడాం, బాతువ పీఏసీఎస్ చైర్మన్లు  ప్రకాష్, పల్లాడ సన్యాసిరావు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వాండ్రంగి అరుణకుమారి,జి ల్లా కార్యవర్గ సభ్యులు పిల్లల శివకుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతినిధి బాలి అప్పలసూరి, సంతఊరిటి పంచాయతీ సర్పంచ్ బుడారి లక్ష్మణరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top