ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పార్ధివ‌దేహానికి ఎమ్మెల్యే బాబు నివాళి

చిత్తూరు: జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి పార్ధివ దేహానికి  ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతి తెలిప‌రు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ... సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రవీణ్ కుమార్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్ కుటుంబానికి సీఎం లేఖ రాశారు..  చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి.. 18 సంవత్సరాలుగా ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నారు.. జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తుండగా.. కాల్పులు జరిగాయి.. ఉగ్రవాదులు కాల్పుల్లో ప్రవీణ్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇవాళ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top