అమరావతి: సీఎం వైయస్ జగన్ ఇస్తున్న భరోసాలా బడ్జెట్ ఉందని, 80 శాతం హామీలను నెరవేర్చేలా బడ్జెట్ ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అప్పలరాజు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ.. గిరిజనులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మత్య్యకారులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. హామీల గురించి అడిగిన మత్య్సకారులను గత టీడీపీ పాలకులు దుర్భాషలాడారని గుర్తు చేశారు. సామాజిక న్యాయమే మా విధానమని సీఎం వైయస్ జగన్ చెప్పారన్నారు.