విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి సూచిక‌

ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌

విశాఖ‌:  విశాఖ‌ప‌ట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి సూచిక అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదిప్‌రాజ్ పేర్కొన్నారు. విశాఖ రాజ‌ధాని కాకుండా ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. చంద్ర‌బాబుకు అమ‌రావ‌తిపై ప్రేమ ఉంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌న్నారు.ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ రెఫ‌రెండంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని స‌వాలు విసిరారు. అన్నిప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ‌రావ‌తిని ఎంచుకున్నార‌ని అదీప్‌రాజ్ విమ‌ర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top