గ్రామ‌ స్వరాజ్యమే లక్ష్యంగా జగనన్న పాల‌న‌

అనంత‌పురం:  గ్రామ స్వ‌రాజ్య‌మే ల‌క్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న సాగిస్తున్నార‌ని మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ అన్నారు. గురువారం అనంత‌పురం జిల్లా కుందుర్పి, అపిలేపల్లి, మలయనూరులో నూతనంగా నిర్మించిన  గ్రామ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ఉషాశ్రీచరణ్  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ  కలలు కన్న గ్రామ స్వరాజ్యంను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా నిజం చేశార‌న్నారు. సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా నేరుగా  అందిస్తున్నాం అని తెలిపారు.

Back to Top