అమూల్ రాక‌తో చంద్ర‌బాబు మోసం బ‌య‌ట‌ప‌డింది

మంత్రి పేర్ని నాని
 

అమ‌రావ‌తి:  రాష్ట్రానికి అమూల్ సంస్థ రావ‌డంతో చంద్ర‌బాబు హెరిటేజ్ ద్వారా ఎంత మోసం చేశారో బ‌య‌ట‌ప‌డింద‌ని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. మంత్రి క‌న్న‌బాబు చెబుతూ చేయూత ద్వారా మ‌హిళ‌కు ఆర్థిక ప‌రిపుష్టి పెంపొదిస్తామ‌ని చెప్పారు. అమూల్ పేరుతో ఇక్క‌డ కొంత మంది గ‌గ్గోలు పెడుతున్నారు. గ‌తంలో మాదిరిగా స‌బ్సిడీ ఇచ్చి ఇక్క‌డ మోసం చేయ‌డం లేదు. మా ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం ఇచ్చేదే కాకుండా రూ.4 అద‌నంగా ఇస్తున్నాం. మా ప్ర‌భుత్వం ఏ అంశంపైనా అయినా స‌రే చ‌ర్చ‌కు సిద్ధంగా ఉంటుంది. ఇవాళ సీఎం తీసుకున్న నిర్ణ‌యం మూలంగా ద‌శాబ్ధాలుగా చంద్ర‌బాబు పాల ద్వారా ఎంత మోసం చేశారో అంద‌రికి అర్థ‌మైంది. 
 

Back to Top