అమరావతి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తన వింతగా ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతుండగా చంద్రబాబు అడ్డుకోవడం , తనకు మైక్ ఇవ్వాలని భైటాయించడం ఆయన అనుభవం ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. చంద్రబాబు తన స్థాయి మరచి ఇవాళ పోడియం వద్ద మెట్లపై కూర్చోవడం, ఆయన సభ్యులు 17 మంది కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని 12 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని మంత్రి పేర్ని నాని స్పీకర్‌ను కోరారు.