గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షసపాలన సాగింది

ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి
 

తిరుమల: తాగుబోతు సంఘానికి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడని ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని దశలవారీగా మద్యం నియంత్రణ అమలు చేస్తుంటే.. మద్యం ధరలు పెరిగిపోయాయంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడన్నారు. తిరుమలలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కూలీ చేసే కార్మికులకు మద్యానికి బానిస చేసే విధంగానే చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రాక్షసపాలనే సాగిందని, రామరాజ్యం ∙కావాలని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైయస్‌ జగన్‌ను సీఎంగా చేసుకున్నారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top