రైతు బజార్ల ద్వారా టమాటాల విక్రయం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

మంత్రి కన్నబాబు

సచివాలయం: టమాటా ధర పడిపోతే తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు టమాటా ధరలు పడిపోయిన చోట మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతు బజార్ల ద్వారా టమాటాల విక్రయం చేస్తామన్నారు. రైతు ఏ దశలోనూ నష్టపోకూడదని చెప్పారు. దళారుల వల్ల రైతులు నష్టపోకూదన్నదే మా లక్ష్యమన్నారు. ఎల్లుండి నుంచి మార్కెటింగ్‌ శాఖ ద్వారా టమాటా కొనుగోలు చేస్తామని మంత్రి వెల్లడించారు. మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నామని మంత్రి చెప్పారు. ఉత్పత్తి అధికంగా ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

Back to Top