వెంక‌ట‌గిరిలో వైయ‌స్ఆర్ సీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం

నెల్లూరు:  వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో తిరుప‌తి ఉప ఎన్నిక వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి త‌ర‌ఫున వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌చారం నిర్వ‌హించింది. ప్ర‌చారంలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, వేణుగోపాలకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..విప‌క్షాల మాట‌లు ప్ర‌జ‌లు వినే ప‌రిస్థితి లేద‌న్నారు.తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి గురుమూర్తి విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Back to Top