రైతుల‌కు మేలు చేసేందుకే అమూల్‌తో ఒప్పందం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

అమ‌రావ‌తి:  రైతుల‌కు మేలు చేసేందుకే అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. హెరిటేజ్ క‌న్నా అద‌న‌పు ధ‌ర చెల్లించి అమూల్ సంస్థ పాలు కొంటుంద‌ని చెప్పారు. ప్ర‌తి జిల్లాలోనూ హెరిటేజ్ క‌న్నా అమూల్ అద‌నంగా చెల్లిస్తుంద‌ని తెలిపారు. రైతుల‌కు మేలు జ‌రుగుతుంటే చంద్ర‌బాబు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మేం మ‌హిళ‌ల‌కు రూ.75 వేలు వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఆ డ‌బ్బుతో ప‌శువులు కొనుగోలు చేయిస్తున్నామ‌న్నారు. రైతులు బాగుప‌డుతుంటే టీడీపీ నేత‌లు ఏడుస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఒక మంచి కార్యక్ర‌మం చేస్తుంటే చందంద్ర‌బాబు ఎందుకు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top