టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు

మంత్రి అంబటి రాంబాబు
 

అమరావతి: నిండు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు దళిత మంత్రి ఎదురుగా నిలబడి ఫ్లకార్డులు చూపిస్తూ రెచ్చగొట్టేలా ప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యుడు బాలవీరాంజనేయులు తీరును మంత్రి ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..  అందరికీ కూడా అర్థమయ్యేలా చెబుతున్నాను. టీడీపీ సభ్యులు ఇక్కడికి వచ్చి మంత్రి మేరుగ నాగార్జున ఎదురుగా నిలబడి ప్లకార్డులు చూపించారు. ఇది తప్పు అని గమనించిన టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ వచ్చి ఆయన్ను వెనక్కి తీసుకెళ్లాడు. ఇది దురుసు ప్రవర్తన కాదా?. మంత్రి మీద పడుతారన్న భావనే కదా. ఇంత కన్న నిండు సభలో జరిగిన అంశం ఇది. ఫ్లకార్డులు తీసుకువచ్చి మాకెందుకు చూపుతున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top