మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా షేక్ అసిఫ్ ప్ర‌మాణ స్వీకారం

విజ‌య‌వాడ‌:  ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన  షేక్ అసిఫ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సి ఎం అంజాద్ బాషా  ,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,పేర్ని నాని ,కొడాలి నాని ,వెల్లంపల్లి శ్రీనివాసరావు ,ఎమ్యెల్సీ షేక్ కరీమున్నిసా ,లేళ్ల అప్పిరెడ్డి , ఎమ్మెల్యే లు,  వైయ‌స్ఆర్‌సీపీ  విజయవాడ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ , తూర్పు ఇన్ ఛార్జ్ అవినాష్ ,కార్పొరేషన్ ఛైర్మన్  ,విజయవాడ,గుంటూరు నగర మేయర్లు,డిప్యూటీ మేయర్ర్లు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top