సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కైవ‌ల్యారెడ్డి

తాడేప‌ల్లి: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్ధిని కె కైవల్యారెడ్డి గురువారం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. కైవ‌ల్యారెడ్డి పాన్‌ స్టార్స్‌ టెలిస్కోప్‌ సహకారంతో బృహస్పతి (గురుడు), అంగారక గ్రహాల మధ్య ఆస్టరాయిడ్‌ను కనుగొన్నారు. ఆమె ప్రతిభకు మెచ్చి నాసా సంస్థ‌ అవార్డు బహుకరించిన విష‌యం విధిత‌మే. కైవ‌ల్య‌ నాసా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ సెర్చ్‌ కొలాబిరేషన్‌ (ఐఏఎస్‌సి) న్యూఢిల్లీలోని స్పేస్‌ పోర్ట్‌ ఇండియా పౌండేషన్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆమెను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించి లక్ష రూపాయలు నగదు పారితోషికం ప్రకటించారు. సీఎంను క‌లిసిన వారిలో కైవల్య తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top