వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు,పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో అభిమానులు, పార్టీ శ్రేణులు సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.  
 

Back to Top