పేదల కళ్లలో ఆనందం చూడటమే సీఎం లక్ష్యం

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 

 

వైయస్‌ఆర్‌ జిల్లా: పేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. వైయస్‌ఆర్‌  జిల్లా కడప నగర శివారులోని ఉక్కాయపల్లి లేఅవుట్‌ను శనివారం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు,అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు పంపిణీ చేయడానికి స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు.

Back to Top