బాబు అవినీతిపై కేంద్రం దృష్టిసారించాలి

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 

అమరావతి: చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విజ్ఞప్తి చేశారు. పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి దగ్గరే రూ. 2 వేల కోట్లకుపైగా అక్రమ సంపాదన ఉంటే.. చంద్రబాబు, లోకేష్‌లను, టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని విచారిస్తే లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటపడుతుందన్నారు. ఐటీ విడుదల చేసిన లేఖతో చంద్రబాబు అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అందినకాడికి దోచుకున్నారని, ఆ సొమ్మునంతా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి దాచుకున్నారన్నారు. బాబు అవినీతి బాగోతాన్ని కేంద్రం బట్టబయలు చేయాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top