ఏలూరుకు చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

అస్వస్థతకు గురైన వారిని పరామర్శించనున్న సీఎం 

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి బయల్దేరారు. అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరుకానున్నారు.
 

Back to Top