తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.