మంత్రి బొత్సకు మాతృవియోగం

 విశాఖపట్నం : పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య  ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌లువురు ఈశ్వ‌ర‌మ్మ మృతికి సంతాపం తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top