ఆధారాలతోనే ‘అవినీతి చక్రవర్తి’  పుస్తకం

  శ్రీకాకుళం : ఇప్పటివరకు దొరికిన ఆధారాలతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’  పుస్తకం వేశామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆధారాలు దొరకని అవినీతి ఇంకా లక్షలకోట్లలో ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ఐదేళ్ల బడ్జెట్‌ని మించి టీడీపీ నేతలు దోపిడి చేశారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో సహజవనరులైన మట్టి, ఇసుకను కూడా మిగల్చకుండా అమ్ముకున్నారని భూమన నిప్పులు చెరిగారు. పోలవరం, రాజధాని భూముల కేటాయింపులో అంతులేని అక్రమాలు జరిగాయన్నారు.

 

Back to Top