ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య మృతి ప‌ట్ల అసెంబ్లీలో సంతాపం

 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభం..

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌ద్వేల్ ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య అకాల మ‌ర‌ణం పొంద‌డం ప‌ట్ల అసెంబ్లీలో స‌భ్యులు సంతాపం తెలిపారు. అలాగే  సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. కొద్దిసేప‌టి క్రితం బీఏసీ సమావేశం ముగిసింది. అనంతరం తిరిగి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది.   ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడుతున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top