బాబు పనైపోయింది.. లోకేష్‌కు సరుకు లేదు

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

 గుంటూరు: టీడీపీ కనుచూపుమేర అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయానికి వచ్చే వారు లేరు ఉన్న వాళ్లు కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. కొడుకు లోకేష్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి మానసిక సంక్షోభంతో చంద్రబాబు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
 

రాష్ట్రంలో అద్భుతమైన పాలన జరుగుతుంటే ముఖ్యమంత్రిని అగౌరవంగా అసభ్యంగా దూషించడం సమంజసం కాదు. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారు. ఆయనకు దీక్ష చేసే అర్హత లేదు. చంద్రబాబు దీక్ష ముఖ్యమంత్రిని దూషించిన వారిని సమర్థించినట్లు ఉంది. నిజాయితీగా దీక్ష చేస్తున్న రంగాని హత్య చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది.

దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన చరిత్ర బాబుది. తెలుగుదేశం నాయకులు చేస్తున్న దీక్షలు మేక తోలు కప్పుకున్న నక్క వంటివి. బాబు పనైపోయింది.. కొడుకు లోకేష్‌కు సరుకు లేదు. ప్రజాకర్షణ గల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తే పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు' అని అంబటి రాంబాబు హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top