వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా ప్ర‌పంచ  ఆదివాసీ దినోత్స‌వం

తాడేప‌ల్లి:  ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక‌లు తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా గిరిజన మాత చిత్ర‌ప‌టానికి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌లు పూల‌మాల వేసి అభిషేకం నిర్వ‌హించారు. అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదివాసుల సంక్షేమానికి అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించారు.  అలాగే విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకలకు విచ్చేసిన పుష్ప శ్రీవాణి ఆదివాసీలతో కలిసి ఉత్సాహంగా ఆడిపాడారు. సంప్రదాయ థింసా నృత్యానికి ఉల్లాసంగా కాలు కదిపారు.   కర్నూలు జిల్లాలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top