భోగి మంటల్లో కరోనా భస్మం..

సినీ నటుడు మోహన్‌బాబు

 తిరుమల:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.  

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు.  
 

Back to Top