సర్వేపల్లిలో 300 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. తోటపల్లి గూడూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఇటీవల సోమిరెడ్డి సమక్షంలో చేరినట్లుగా ప్రకటించిన వారితోపాటు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు కూడా తెలుగుదేశం పార్టీని వీడివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామమ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వారు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక మమ్ములను విమర్శించడమే పనిగా పెట్టుకున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ వారు మాకు ఫ్రీ పబ్లిసిటీ అందించడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంద‌న్నారు. ప్రజలందరూ విమర్శలను అర్థం చేసుకుని ఎవరు అభివృద్ధి చేశారో చర్చించి, అభివృద్ధి చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని.. అభివృద్ధిని విస్మరించి విమర్శలకు పరిమితం అవుతున్న సోమిరెడ్డిని సాగనంపాలని నిర్ణయం తీసుకున్నార‌ని మంత్రి తెలిపారు.

ధాన్యం దళారులు, వ్యాపారుల దగ్గర 50 కోట్ల రూపాయలు సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు రాజగోపాల్ రెడ్డి ముడుపులు కొట్టేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ద్రోహం చేశారని అన్న‌దాత‌లు మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో 50 వేల పైచిలుకు భారీ మెజారిటీతో కాకాణి విజయం సాధిస్తార‌ని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. 

Back to Top