వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, జ‌న‌సేన నేత‌లు

ఏలూరు జిల్లా:  తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా నారాయ‌ణ‌పురం స్టే పాయింట్ వ‌ద్ద ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌ సమక్షంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్‌ అశోక్‌ కుమార్, దాచేపల్లి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ  పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్‌.పేరయ్య, టీడీపీ సీనియర్‌ నేత గుంటుపల్లి రామారావు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా వైయ‌స్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్‌యాదవ్‌, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Back to Top